Apr 19,2023 00:29

మణికుమార్‌ను పరామర్శిస్తున్న కరణం వెంకటేష్‌బాబు

ప్రజాశక్తి -చీరాల : ప్రజాశక్తి చీరాల విలేకరిగా పనిచేస్తున్న బెజ్జం మణి కుమార్‌ ఒంగోలులోని వెంకరమణ హాస్పిటల్‌లో ఇటీవల మోకాలుకు శాస్త్ర చికిత్స చేయించకున్నాడు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందులో భాగంగా వైసిపి చీరాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ బాబు, మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు విజయనగర కాలనీలోని మణికుమార్‌ నివాసానికి వెళ్లి పరామర్శించారు. మణికుమార్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మణికుమార్‌ను పరామర్శించిన వారిలో వైసిపి నాయకుడు బుర్ల మురళి తదితరులు ఉన్నారు.