Sep 02,2023 22:25

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
              ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన పింఛన్లను పెన్షన్‌దారులకు శనివారం పంపిణ ీచేశారు. వికలాంగులకు త్రి చక్ర మోటార్‌ సైకిళ్లు అందించారు. అనంతరం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని వాటిని శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎస్‌ ఛైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
            పోడూరు : వైసిపి కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేస్తూ ముందుకు సాగాలని ఆ పార్టీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపి పిలుపునిచ్చారు. మండలంలోని జిన్నూరు గ్రామంలో సొసైటీ ఛైర్మన్‌ డిటిడిసి బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద శనివారం కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, పింఛన్లు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అందించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే సిఎం జగన్‌ లక్ష్యమన్నారు. పార్టీలకు, కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు. తొలుత గ్రామంలో వైసిపి కార్యకర్తలను డిటిడిసి బాబు గుడాల గోపికి పరిచయం చేశారు. అనంతరం ఆయనను పార్టీ కార్యకర్తలందరూ ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు, ఎంపిపి సబ్బితి సుమంగళి సాగర్‌, సర్పంచి జమ్మూ బేబీ మహాలక్ష్మి, మండల ఇన్‌ఛార్జి కలిదిండి గణపతిరాజు, ఎఎంసి డైరెక్టర్‌ జమ్ము బుజ్జి, గ్రామ కమిటీ అధ్యక్షులు భూపతి రాజు సూర్పరాజు, బొండపల్లి గిరిజ, కడలి సూర్యచంద్రరావు, శెట్టి చినబాబు, చింతపల్లి రాధాకృష్ణ, పితాని సత్యప్రసాద్‌, తొండ శ్రీనివాస్‌, చాణిక్య శెట్టి, నాగరాజు పాల్గొన్నారు.