Dec 22,2022 21:13

ప్రజాశక్తి - ఆగిరిపల్లి
             వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందించడంతో పాటు అనాధ పిల్లలకు సువిశాలమైన ప్రాంగణంలో ఉచితంగా విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం ఎంతో అభినందనీయమని అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు కొత్తపల్లి సీత అన్నారు. ఆగిరిపల్లి మండల పరిధిలోని తోటపల్లి హీల్‌ ప్యారడైజ్‌లో ఉన్న ఎలిజబెత్‌ లెగసీ ఆఫ్‌ హోప్‌ కేంద్రం వద్ద పలు జిల్లాలకు చెందిన ముగ్గురు వికలాంగులకు ఆమె గురువారం కృత్రిమ అవయవాలను అందించారు. ఈ సందర్భంగా కోల్‌ ఇండియా విశ్రాంత జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.చంద్రమౌళి మాట్లాడుతూ వికలాంగులకు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో తమ జీవనాన్ని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో హీల్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌, సిఇఒ కూరపాటి అజరుకుమార్‌, కృత్రిమ అవయవ కేంద్రం సీనియర్‌ టెక్నిషియన్‌ సన్నీజాన్‌, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.