
ఏలూరు టౌన్ : దొండపాడులోని ఉమా ఎడ్యుకేషనల్, టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రంలో అంతర్జాతీయ ప్రోస్టెట్సిస్, ఆర్థోటిక్స్ దినోత్సవం సందర్భంగా అవసరమైన వారికి సంస్థ కో ఆర్డినేటర్ డి.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కృతిమ అవయవాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మా సంస్థ ద్వారా 35 సంవత్సరాలుగా ఎంతో మంది వికలాంగులకు పునరావాసం కల్పించి సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం ద్వారా వికలాంగులకు అవసరమైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. వాటిలో కృతిమ అవయవాలు, ఫిజియో థెరఫీ, అడియోలజి, స్పీచ్ థెరఫీ మొదలగు సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 08812-249297, 7386565469 సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.