
పలువురికి ట్రై సైకిళ్లు, వీల్ ఛైర్లు అందజేత
ఏలూరు టౌన్ : వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వైసిపి జిల్లా అధ్యక్షులు ఎంఎల్‌ఎ ఆళ్ల నాని తెలిపారు. శుక్రవారం ఎంఎల్‌ఎ చేతుల మీదుగా పలువురికి వీల్ ఛైర్లు, ట్రై సైకిళ్లు అందజేశారు. డిప్యూటీ మేయర్‌లు ఎన్.సుధీర్ బాబు, గుడిదేసి శ్రీనివాసరావు, ఎఎంసి ఛైర్మన్ నెరుసు చిరంజీవులు, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, పలువురు కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.