ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు
ప్రజాశక్తి - గోనెగండ్ల
మండలంలోని వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. సోమవారం గోనెగండ్లలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా సుంకన్న, ఉపాధ్యక్షులుగా బోయ మునిస్వామి, ప్రధాన కార్యదర్శిగా మహబూబ్ బాషా, సహాయ కార్యదర్శులుగా శాంతి, మునెప్ప, కోశాధికారిగా రంగన్నను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వికలాంగుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు. విహెచ్‌పిఎస్ నాయకులు శ్రీనివాసులు, సోమన్న, నాగ శేషమ్మ, నరసింహుడు, సన్నప్ప, కురువ రాముడు, రఘు పాల్గొన్నారు.










