Sep 19,2022 00:09

మాట్లాడుతున్న పాల వెంకయ్య

ప్రజాశక్తి-గాజువాక : ప్రభుత్వ, ప్రయివేటు సెక్టర్‌లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలుచేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) డిమాండ్‌చేసింది. ఎన్‌పిఆర్‌డి విశాఖ జిల్లా అధ్యక్షులు పాల వెంకయ్య అధ్యక్షతన వికలాంగుల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం పెదగంట్యాడ సిడబ్ల్యుసిలో జరిగింది. కంట్రీ న్యూస్‌ సిఇఒ పివివి చంద్రశేఖర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 4 శాతం రిజర్వేషన్లు సక్రమంగా అమలుకాక వికలాంగులు నిరుద్యోగులుగా ఉండిపోతున్నారన్నారు. 2016 వికలాంగుల చట్టాన్ని అమలుపరచాలని, అంత్యోదయ కార్డు కల్పించాలని, ఇంటి పన్ను, వాటర్‌ బిల్లు, కరెంట్‌ బిల్లులో రాయితీ కల్పించాలని డిమాండ్‌చేశారు. పాల వెంకయ్య మాట్లాడుతూ, అక్టోబర్‌లో జరిగే ఎన్‌పిఆర్‌డి జిల్లా మహాసభలకు వికలాంగులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి మల్లేశ్వరరావు, ఈశ్వరరావు, అప్పలరాజు, పెంటయ్య, నూకరాజు, లలిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.