ప్రజాశక్తి-కోటవురట్ల: మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో వికలాంగుల పింఛన్లపై బుధవారం ఎంపీడీవో చంద్రశేఖర్ సర్వే నిర్వహించారు. ప్రధానంగా సదరం సర్టిఫికెట్ లేని వారిని తొలగిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అయితే అటువంటి వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో సదరం కేంద్రాన్ని ఏర్పాటు చేసి అర్హులందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమ ంలో ఆయా గ్రామాల సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కొత్తకోట:
వికలాంగుల పింఛన్లపై జరుగుతున్న సమగ్ర పరిశీలనలో భాగంగా బుధవారం రావికమతం మండలం దొండపూడిలో సర్వే నిర్వహించారు. ఈ సందర్బంగా మండల ఈవోఆర్‌డి సంజివ రమణయ్య మాట్లాడుతూ, గ్రామంలో సుమారు 89 వికలాంగ పింఛన్ దారులు ఉండగా, 54 పింఛన్‌ల పరిశీలన చేశామని తెలిపారు. ఈ పరిశీలనలో సదరన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులతో ప్రస్తుతం పొందుతున్న పింఛన్ ఐడి, వ్యక్తి గత ఫోటో సేకరణ తదితర అంశాలను ప్రభుత్వం ఇచ్చిన యాప్ ద్వారా నమోదు చేస్తూన్నామని ఆయన వివరిం చారు. మండల వ్యాప్తంగా పింఛన్ పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జి.రాజారావు, సచివాలయ కార్యదర్శి దాలి నాయుడు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.










