Apr 25,2023 22:47


జెఎసి ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
నిరుద్యోగుల రిలే నిరాహార దీక్షలు
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
స్థానిక వికలాంగలు, వయోవద్ధుల సహాయ సంస్థ కార్యాలయం వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వికలాంగ నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు జిల్లా అధ్యక్షులు మండపాక అప్పన్న దొర ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా టిడిపి వికలాంగుల కమిటీ పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర్‌ రెడ్డి రూ.200ల పింఛన్‌ రూ.500 చేస్తే రూ.500 నుండి 3000 చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలయినా వికలాంగులకు ఒక రూపాయి పింఛన్‌ పెంచలేదు కానీ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచిందన్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఎక్కడ ఒక ఉద్యోగం కూడా వికలాంగులకు కల్పించలేదని, వివాహ ప్రోత్సాహం పదో క్లాస్‌ పాస్‌ అవ్వాలని ఆంక్ష విధించడం ఎంతవరకు సమంజ సమని, చదువుతో పని లేకుండా అర్హులందరికి వివాహ ప్రోత్సాహం అందించాలని అన్నారు. సమస్యలు తీర్చకుంటే తీవ్రమైన పోరాటాలు చేస్తామనికార్యక్రమంలో కాకినాడ జిల్లా టిడిపి వికలాంగుల సంఘం కార్యదర్శి ఎస్‌కె. కరీముల్లా, ఉపాధ్యక్షులు నరం శ్రీనివాసరావు, టిడిపి రాష్ట్ర నాయకులు గింజల దుర్గాప్రసాద్‌ యాదవ్‌, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెఎసి ప్రధాన కార్యదర్శి పొలమూరి పెద్దకాపు, చైర్మన్‌ గుణపర్తి కొండలరావు, సభ్యులు జలతారపు వెంకన్న, మంద అప్పారావు, ఆర్‌ నాగేశ్వరరావు, చింతపల్లి పవన్‌ పాల్గొన్నారు.


ధర్నా చేస్తున్న వికలాంగులు, సంఘం నాయకులు