Aug 16,2023 21:53

బాలాజీకి వీల్‌ఛైర్‌ అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలోని లక్ష్మిపురం నివాసం ఉంటున్న బాలాజీ తన కుటుంబ పోషణ కోసం రైల్వే స్టేషన్‌లో చిప్స్‌ పాకెట్టు అమ్మి వవ్చిన ఆదాయంతో జీవనం చేస్తున్నారు. గత సంవత్సరం రైల్వే స్టేషన్‌లో చిప్స్‌ పాకెట్లు అమ్ముతున్న సమయంలో ప్రమాదవాశాత్తు జారిపడి ఎడమ చేయి, కాలు పోగొట్టుకుని వికలాంగుడిగా మారాడు. దీంతో బాలాజీ అప్పటి నుంచి మంచానికి పరమితమయ్యాడు. తన కాలకృత్యాలను తీర్చుకోలేని స్థితిలో ఉన్నాడు. ఈ విషయం గమనించిన సహస్ర ప్రణామం అనాధాశ్రమం నిర్వాహకులు ఆదిత్య, శివకుమార్‌, చండ్రాయుడు, నరసింహులు కలిసి బాలాజీకి తమ వంతు సాయం చేయాలని నిర్ణయించారు. వారందరు కలిసి బుధవారం నివాసానికి వెళ్లి మూడు చక్రాల సైకీల్‌తో పాటు వాకర్‌, మూత్ర విసర్జన కుర్చీలను అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు బాలాజీకి వికలాంగ ఫించన్‌ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.