Jul 20,2023 17:20

మధు మణి ఆసుపత్రి లో ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్న వైద్య బృందం.

విజయవంతంగా  కొనసాగుతున్న మధుమణి ఉచిత శస్త్ర చికిత్సల వైద్య శిబిరం
ప్రజాశక్తి - నంద్యాల

      స్థానిక మధుమణి నర్సింగ్ హోమ్ లో గత సోమారం ప్రారంభించబడిన 32 వ ఉచిత చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్సల శిబిరం విజయవంతంగా కొనసాగుతున్నది.సోమవారం రోగులను ఎంపిక చేసుకుని అవసరమైన పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్సలకు సిద్ధం చేసి మంగళవారం నుంచి రోజుకు  15 ఆపరేషన్ల చొప్పున చేస్తున్నారు. గురువారం సాయంత్రానికి 50 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ  వారం రోజులలో మధుమణి ఆసుపత్రి నిర్వాహకులు ప్రముఖ  చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ మధుసూధన్ రావు,డాక్టర్ మణిదీప్,డాక్టర్ రోహిత్ లతోపాటు దేశంలో వివిధ నగరాలకు చెందిన ప్రఖ్యాత  చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ దీపక్ హల్దిపూర్, డాక్టర్ సతీష్ జైన్ , డాక్టర్ శంకర్ మెడికేరి, డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ మూర్తి ,డాక్టర్ ఆర్షద్ హుస్సేన్,డాక్టర్ విద్యాసాగర్,డాక్టర్ శ్రీపతి నాయుడు, డాక్టర్ తేజస్విని తదితరులు ఈ నెల 23 వ తేదీ వరకు మొత్తం 100 శస్త్ర చికిత్సలు ఉచితంగా ఈ శిబిరంలో చేయడం జరుగుతుంది. ఈ శస్త్ర చికిత్సలకు అవసరమైన అనస్థీషియాను ప్రముఖ మత్తుమందు వైద్యులు డాక్టర్. జి.రవి కృష్ణ, డాక్టర్.డి.మాధవి అందజేస్తున్నారు. ప్రతిరోజు ఓపిడీలో 250 మంది రోగుల్ని పరీక్షించి అవసరమైన మందుల్ని ఉచితంగా వారం రోజులపాటు ఇస్తున్నారు. శస్త్ర చికిత్సలు, ఓ పి డి పరీక్షలు, మందులు అన్నీ కలిసి 50 లక్షల రూపాయల విలువ చేసే సేవలు ఈ శిబిరంలో నిరుపేదలకు అందజేస్తున్నామని మధుమణి ఆసుపత్రి నిర్వహకులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్ తెలియజేశారు.