ఆపరేషన్ చేసుకున్న వారిని పరామర్శిస్తున్న దాతలు
ప్రజాశక్తి - ఆదోని
ఆదోనిలో 12న అవోపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో ఎంపికైన వారికి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో నిర్వహించిన ఆపరేషన్లు విజయంతమైనట్లు అవోపా అధ్యక్షులు శ్రీనాథ్ గుప్త, దాత నరేష్ కాకుబాళ్ తెలిపారు. ఆదోనికి వచ్చిన రోగులను మంగళవారం కలిసి వారు పరామర్శించారు. పేదల కళ్లల్లో వెలుగు నింపడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. అవోపా ఉపాధ్యక్షులు ప్రతాప్, ఈరన్న శెట్టి, రంగనాయకులు, కార్యదర్శి మిరియాల శ్రీధర్, సంగీత, మమతశ్రీ, హిమబిందు, గీత పాల్గొన్నారు.










