ప్రజాశక్తి - చీరాల
విజయవాడలో ఈనెల 24న మాల యువసేన ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలను జయప్రదం చేయాలని మాల యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు కోరారు. పట్టణంలోని పేరాలలో మాల యువసేన ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు కాపాడు కొనేందుకు, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేందుకు విజయవాడలో చేపట్టిన మహా దీక్షకు మాల సోదరులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. మాదిగ సోదరులలో కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వర్గీకరణను తెస్తున్నారని అన్నారు. వాస్తవానికి అసాధ్యమైన ఎస్సి వర్గీకరణ అంశాన్ని అగ్ర నాయకులకు తొత్తులుగా వ్యవహరించేందుకు మాదిగలు ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపే పార్టీని పూర్తిగా మాలలు వ్యతిరేకించాలని కోరారు. ప్రస్తుతం బిజెపి వర్గీకరణకు పరోక్షంగా సహకరిస్తుండడం గమనిస్తున్నామని అన్నారు. బిజెపికి మాలలు గుణపాఠం చెబుతారన్నారని అన్నారు. సమావేశంలో మాల యువసేన రాష్ట్ర అధ్యక్షులు చైతన్య, మాలభేరి నాయకులు ప్రీతం, కిషోర్ పాల్గొన్నారు










