Nov 13,2022 23:13

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ 

రాష్ట్రంలో అవినీతి అనకొండలా పెరిగిందని, లిక్కర్‌ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడు అన్నను అరెస్టు చేశారని, దీనికి సూత్రధారి విజయసాయి రెడ్డి కాబట్టి, ఆయన్ను కూడా అరెస్టు చేసి, నార్కో టెస్ట్‌ పరీక్షలు చేయిస్తే విషయం బయటపడుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న కోరారు. ఆదివారం వన్‌టౌన్‌లోని బుద్ధా వెంకన్న నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమా వేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ సిఎం కొడుకుగా, ఆడిటర్‌గా ఉన్న జగన్‌, విజయ సాయి రెడ్డిలు రూ. 40 వేల కోట్లు దోచుకున్నారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి రెట్టింపు స్థాయిలో ప్రజా ధనాన్ని దోచేశారన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని విజయసాయి రెడ్డికి నార్కో పరీక్ష చేయించాలని కోరారు. అతని అవినీతిపై ఈడీ కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు