
ప్రజాశక్తి - సీతంపేట : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వల్ల గిరిజనుల ముంగిట్లోకే వైద్యం అందుతుందని, నాణ్యమైన వైద్యంతో ఉచితంగా పాటు వైద్యపరీక్షలు, మందులు కూడా అందిస్తున్నట్టు ఐటిడిఎ డిప్యూటీ డిఎంహెచ్‌ఒ కె.విజయ పార్వతి అన్నారు. 'ప్రజాశక్తి'తో ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకూ నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు 32,798 మందికి వైద్యపరీక్షలు చేసి, శస్త్ర చికిత్సలకు 896 మందిని రిఫర్ చేశామని చెప్పారు. ఈ వైద్యశిబిరాలకు ప్రతి రోజూ సుమారు 400 నుండి 500కు పైగా రోగులు వస్తున్నారని చెప్పారు. వీరికి తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో పాటు స్పెషలిస్ట్‌లతో కూడా తనిఖీలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఐటిడిఎ పరిధిలో గల మర్రిపాడు, దోనుబాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్‌నర్సుల కొరత ఉందని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా మన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం కూడా పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వైద్యులను, సిబ్బందిని అప్రమత్తం చేసి గిరిజనులకు సకాలంలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు.
జెఎఎస్‌తో గిరిజనుల ముంగిటకే వైద్యం