Oct 29,2023 20:37

రైలు ఢకొీనడంతో పక్కకు ఒరిగిపోయిన బోగీలు

ప్రజాశక్తి - విజయనగరం : విజయనగరం జిల్లా కొత్తవలస సమీపాన ఘోర రైలు ప్రమాదం ఆదివారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు అలమండ- కంకాపల్లి వద్ద సిగల్‌ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనుకనే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్‌ రైలును వెనుక నుంచి వచ్చి ఢకొీంది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైలుఢకొీనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ తీగెలు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంథకారం నెలకొంది. ఫలితంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.