శుభాకాంక్షలు తెలుపుతున్న నాయకులు
ప్రజాశక్తి - మంత్రాలయం
కెడిసిసి బ్యాంకు ఛైర్మన్ ఎస్వీ.విజయమనోహరికి మంత్రాలయం, ఆదోని ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, వై.సాయి ప్రసాద్ రెడ్డి, వైసిపి రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై.ప్రదీప్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కర్నూలులో ఆమెను ప్రదీప్‌రెడ్డి కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఇటీవల ఎస్వీ.మోహన్ రెడ్డి సతీమణి ఎస్వీ.విజయమనోహరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కెడిసిసి బ్యాంకు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆమెను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కూడా ఎమ్మెల్యేలకు మిఠాయిలు అందజేసి ఆశీస్సులు పొందారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి, వైసిపి మంత్రాలయం మండలాధ్యక్షులు భీమిరెడ్డి ఉన్నారు.










