
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, ప్రజలకు ఓ ప్రకటనలో విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23 సోమవారం సెలవు దినంగా ప్రకటించినందున ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో, డివిజన్, మండల, గ్రామ సచివాలయ పరిధిలో నిర్వహించ వలసిన జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం- స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.