
ప్రజాశక్తి - పాలకొల్లు
ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా పాలకొల్లులోని విజయల్యాబ్‌కు జాతీయ అక్రిడిటేషన్ బోర్డు ఎన్‌ఎబిఎల్ గుర్తింపు ఇచ్చినట్లు మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ బాబ్జి ప్రకటించారు. ఈ మేరకు ల్యాబ్ ఆవరణలో గురువారం గుర్తింపు సర్టిఫికెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబ్జి మాట్లాడుతూ జిల్లాలోని ఆసుపత్రులు ఇప్పటివరకు కేన్సర్, థైరాయిడ్ టెస్ట్‌లకు హైదరాబాద్, ముంబై ప్రాంతాలకు శాంపిల్స్ పంపేవారమని, దీంతో రోగికి వ్యయప్రయాసలు అయ్యేవని చెప్పారు. ఇప్పుడు పాలకొల్లులో క్వాలిటీ విశ్లేషణతో ఈ సౌకర్యం లభించడం వైద్యులకు, రోగికి ఎంతో సౌకర్యమన్నారు. డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ పాలకొల్లు వంటి ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. తరచూ రక్త నమూనాలు, వైద్య పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. 25 ఏళ్లుగా ల్యాబ్ నిర్వహిస్తూ నేడు జిల్లాలోనే జాతీయ గుర్తింపు ల్యాబ్‌గా తీర్చి దిద్దిటం పట్ల వైద్యులు డాక్టర్ జయ దుర్గాదేవి, నిర్వాహకులు కొమ్ముల మురళీకృష్ణ, సతీమణి శ్రీలక్ష్మిలను అభినందించారు.