
ప్రజాశక్తి - పాలకొల్లు
పాలకొల్లులో విజయ ల్యాబ్‌కు జిల్లాలో తొలిసారి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన లైసెన్స్ రావడం పట్ల ల్యాబ్ అధినేత కొమ్ముల మురళిని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు అభినందించారు. ఈ మేరకు ల్యాబ్ పెథాలజిస్ట్ డాక్టర్ ప్రశాంతి, సిబ్బందిని సోమవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఐదు లక్షలకు పైగా ల్యాబ్‌లు ఉండగా కేవలం ఐదు వేల ల్యాబ్‌లు మాత్రం ఎన్‌ఎబిఎల్ గుర్తింపు పొందాయని, దానిలో పాలకొల్లు ఉండటం గర్వకారణమన్నారు. వెల్లూరు మెడికల్ కాలేజీ వారు పంపిన శ్యాంపిల్‌తో ఫలితం సరిపోతేనే ఈ సర్టిఫికెట్ ఇస్తారని చెప్పారు. వ్యాధులు పెరుగుతున్న ఈ వేళలో కచ్చితంగా వ్యాధి తెలిస్తేనే రోగ నివారణతో పాటు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. టిడిపి నేతలు పెచ్చెట్టి బాబు, జివి, రేపాక ప్రవీణ్, రావూరి వెంకట అప్పారావు పాల్గొన్నారు.