
ప్రజాశక్తి - పాలకోడేరు
జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణకు అరుదైన సత్కారం లభించింది. ఇటీవల జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులుగా నియమితులైన బాలకృష్ణను విస్సాకోడేరు ప్యారిస్ పరిధిలోని ఆరు సంఘాల పిసిసి, ఎల్‌సిసి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సత్కరించారు. గొరగనముడి సెయింట్ జోసెఫ్ లూధరన్ చర్చిలో గురు మండల అధ్యక్షులు పాస్టర్ ఎం.రాజు, డేలిగేట్ రాజశేఖర్, నరసింహం సమక్షంలో సత్కరించారు. ఈ సందర్భంగా పాస్టర్ రాజు మాట్లాడుతూ సమాజంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా కృషి చేయాలని కోరారు. బాలకృష్ణ మాట్లాడుతూ ప్యారిస్ ఆధ్వర్యంలో పిసిసి, ఎల్‌సిసి, సంఘ సభ్యుల సమక్షంలో తనకు సత్కారం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు తులసీ చంద్రమోహన్, పాలపర్తి చిన్ని, గోడి రమేష్‌బాబు, పితాని పద్మనాభం, మట్టా రాజేష్, గంటా చిన్నా జయ, కోరం సురేష్, మండ నేహిమియ్య, దుండి ఆనందరావు, దుండి సురేష్, గెడ్డం గమనియేలు, ఏలేటి జయనాధం, రావిజార్జి ముల్లారారావు, కోరం నదికేశ్వరరావు, కోరం వెంకన్న, దీపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.