విచారణ చేపడుతున్న అధికారులు
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్ :స్థానిక ఫాస్ట్ రేంజ్ కార్యాలయంలో రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ డిఎఫ్‌ఓ ఎం.రవిశంకర్ శర్మ తనిఖీలు నిర్వహించి ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు. గతంలో పని చేసిన రేంజ్ అధికారి బొత్స అప్పలరాజుపై ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో అధికారులను, బీట్ ఆఫీసర్లను విచారణ చేస్తున్నామని తెలిపారు. వేములపూడి సామిల్లుకు అనధికారికంగా కొన్ని చెట్లు తరలించినట్లు ఫిర్యాదులో పేర్కొనడంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ పని చేసిన శిక్షణ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లను విచారణ చేసి నిజానిజాలు నిర్ధారణ అయితే తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదు చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి తమకు ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు.










