ప్రజాశక్తి-గుంటూరు : క్రీడారంగంలో ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తిని చాటే విధంగా విద్యార్థులు రాణించాలని ఆర్‌విఆర్ అండ్ జెసి ఇంజినీరింగ్ కాలేజి అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. కళాశాలలో రెండ్రోజులుగా జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంటర్-కాలేజియేట్ బాస్కెట్‌బాల్ మెన్ అండ్ ఉమెన్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో బాలుర విభాగంలో ఆర్‌విఆర్ అండ్ జెసి ఇంజినీరింగ్ కాలేజి జట్టు ప్రథమ స్థానంలో, ధనలక్ష్మీ ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజి ద్వితీయ, ఏసీ కాలేజి జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ధనలక్ష్మీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజి, వాగ్దేవి డిగ్రీ కాలేజి జట్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, ఇతర అతిథుల చేతులమీదుగా బహుమతులను, ప్రశంసా పత్రాలను అందచేశారు. కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ డాక్టర్ కె.కృష్ణప్రసాద్, డైరెక్టర్లు డాక్టర్ కె.రవీంద్ర, డాక్టర్ ఎన్.వి.శ్రీనివాసరావు, ఎఎన్‌యు యోగా కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణ, కళాశాల ఫిజికల్ డైరెక్టర్లు డాక్టర్ పి.గౌరీశంకర్, డాక్టర్ ఎం.శివరామకృష్ణ పాల్గొన్నారు.
ట్రోఫీజులు అందుకున్న విన్నర్స్ జట్లు