ప్రజాశక్తి -ఆనందపురం: నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, భీమిలి బ్లాక్ ఆధ్వర్యంలో పొడుగుపాలెంలో జరిగిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ యువ వాలంటీర్ లొడగల అచ్చిబాబు, టి. శంకర్ సారధ్యంలో వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, లాంగ్‌జంప్ తదితరపోటీలు నిర్వహించారు. వాలీబాల్ పోటీల్లో బోయిపాలెం విజేతగా నిలవగా, పొడుగుపాలెం జట్లు రన్నరప్‌గా నిలిచింది. కబడ్డీ పోటీల్లో చందక 'ఎ,బి' జట్లు వరుసగా ప్రధమ, ద్వితీయస్థానంలో నిలిచాయి. లాంగ్ జంప్‌లో బంటుబిల్లి జగదీశ్ ప్రథమ, వరహ నరసింహ ద్వితీయ, బంటుపల్లి వంశీ తతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి గొర్రెల ఉమామహేశ్వరరావు బహమతులు అందజేశారు. కార్యక్రమంలో చక్రవర్తి, లీలాప్రసాద్, తారకేష్, బంగారాజు, వంశీ, ప్రభు, జగదీష్, అనూప్, నాగరాజు పాల్గొన్నారు.










