Sep 12,2023 21:42

ప్రజాశక్తి - ముసునూరు
   నూజివీడు నియోజవర్గ ఆటల పోటీలకు రమణక్కపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. మండల స్థాయి జట్టుకు ఎంపికైన ఆరుగురు విద్యార్థులు ఈనెల 14, 15వ తేదీలలో ముసునూరులో నిర్వహించే నూజివీడు నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలలో పాల్గొననున్నారని వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆటల పోటీలు ముసునూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో బాల, బాలికలకు మంగళవారం నిర్వహించారు. అండర్‌ 14, 17వ విభాగాలలో వాలీబాల్‌ ఆటలో రమణక్కపేట హైస్కూల్‌ విద్యార్థులు(బాలురు), వాలీబాల్‌ ఆటలో అండర్‌బి 17, ముసునూరు, గోపవరం, విద్యార్థులతో ఫైనల్‌ మ్యాచ్‌ వేల్పుచర్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులతో ఆడి విజేతగా నిలిచారు. మండల స్థాయి జట్టుకు ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పివిఎస్‌ రామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.