
ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్
మండలం దగ్గులూరులో బ్రహ్మంగారి గుడి వద్ద వీవర్స్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.23 లక్షలతో నిర్మిస్తున్న ఈ కమ్యూనిటీ హాల్ చేనేత కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పాముల రజిని కుమార్, ఫ్లోర్ లీడర్ శాగ సత్యనారాయణ, యూనిట్ ఇన్‌ఛార్జి అందే కోటి వీరభద్రరావు, అవతార రాజు, మండల పరిషత్ ఫ్లోర్ లీడర్ సాగర్ సత్యనారాయణ పాల్గొన్నారు.