
ప్రజాశక్తి - వీరవాసరం
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వీరవాసరంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. వీరవాసరం ఎంఆర్‌కె జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అండర్ -14, అండర్ - 17 విభాగంలో బాలబాలికలకు పోటీలు నిర్వహిం చారు. ఈ ఎంపిక పోటీల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్ ఆంశాల్లో పోటీలు జరిగాయి. అండర్ - 14 బాలికల ఖోఖోలో కొణితివాడ, కబడ్డీలో, షార్టుఫుట్, డిస్క్‌త్రో, లాంగ్‌జంప్‌లో వీరవాసరం జట్లు విజయం సాధించాయి. అండర్ -14 బాలుర విభాగంలో షార్ట్‌ఫుట్‌లో తోలేరు, డిస్క్‌త్రో తోలేరు, లాంగ్ జంపు వీరవాసరం, వాలీబాల్‌లో కొణితివాడ, కబడ్డీ, ఖోఖో వీరవాసరం, టెన్నికాయిట్ తోలేరు జట్లు విజయం సాధించాయి. అండర్ - 17 బాలికల విభాగంలో కబడ్డీ, ఖోఖో, త్రో బాల్‌లో వీరవాసరం జట్లు విజయం సాధించాయి. అండర్ - 17 బాలుర విభాగం అథ్లెటిక్స్, షార్ట్‌ఫుట్, డిస్క్‌త్రోలో తోలేరు, లాంగ్ జంప్, త్రిపుల్ జంప్‌లో వీరవాసరం జట్లు విజయం సాధించాయి. ఎస్‌జిఎప్ మండల స్థాయి గేమ్స్ అండర్-17 బాలుర విభాగంలో వాలీ బాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో వీరవాసరం, టెన్నికాయిట్‌లో తోలేరు జట్లు విజయం సాధించాయి. అథ్లెటిక్స్ అండర్ -17 విభాగంలో షార్టుఫుట్, డిస్క్ త్రో, త్రిపుల్ జంప్‌లో తోలేరు విజయం సాధించగా, లాంగ్ జంప్‌లో వీరవాసరం విజయం సాధించింది. ఈ పోటీల్లో మండల విద్యాశాఖాధికారులు ఎన్.రాజేష్, ఎంఎన్‌ఎస్ .నారా యణ, ప్రధానోపాధ్యాయులు జె.శ్రీనివాస్, మండల ఎస్‌జిఎఫ్ కో-ఆర్డినేటర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.