వీరుల ఆశయాలను కొనసాగిద్దాం
ఆత్మకూరు :యువతి, యువకులు భగత్ సింగ్, సుగుదేవ్, రాజ్ గురు ఆశయ సాధనకు పోరాటం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆత్మకూర్ మండల కార్యదర్శి కే దినేష్ కుమార్, మాజీ డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఏ రణధీర్ డి రామ్ నాయక్ అన్నారు. పట్టణంలోని సుదర్శన వర్మ కార్యాలయం నుండి గౌడ్ సెంటర్ కొత్త బస్టాండ్ మీదగా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు : దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడి అతి చిన్న వయసులోనే ఉరి కంభంను ముద్దాడి ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల ఆశయాలను కొనసాగింద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు పేర్కొన్నారు. గురువారం నాడు పి ఫకీర్ సాహెబ్ అధ్యక్షతన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖుదేవ్ వర్ధంతి సభ నందికొట్కూరు సిపిఎం కార్యాలయం దగ్గర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు, సిపిఎం నాయకులు కే భాస్కర్ రెడ్డి, పి వెంకటేశ్వర్లు మాట్లాడారు. దేశానికి స్వతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల అవుతున్న దేశంలో పేదరికం, ఆకలి చావులు, ఆత్మహత్యలు, నిరుద్యోగం మరింత పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు గోపాలకృష్ణ, రామ్ రెడ్డి, సోడా బిబి, నరసింహులు, ఏసన్న తదితరులు పాల్గొన్నారు.
- అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి రణధీర్, మండల కార్యదర్శి నరసింహ నాయక్‌లు అన్నారు. గురువారం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల 92వ వర్ధంతి సంద ర్బంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వారి చిత్రపటాలకి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలోని అర్బన్ కాలనీలో 21వ వార్డు కౌన్సిలర్ బోయ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో స్థానిక భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని కొత్త రామాపురం గ్రామంలో సిపిఎం మండల కార్యదర్శి నరసింహ నాయక్, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు రామ్ నాయక్, ఇస్మాయిల్, మా బాష, గణపతి, శివకుమార్, శివుడు, మల్లయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ ఫోటో రైట్‌అప్. భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న సీఐటీయూ నాయకులు.
శ్రీశైలం ప్రాజెక్టు : మండలంలోని సున్నిపెంట గ్రామంలో స్థానిక రింగ్ పార్క్ సెంటర్ నందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిన్న మారెన్న, మండల నాయకులు నాగ సైదయ్య, సిఐటియు శ్రీశైలం మండల అధ్యక్షులు దర్శనం నాగరాజు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ శ్రీశైలం మండలం అధ్యక్షులు ఏ.రాము, దాసు, జెడ్డా. నాగరాజు,లక్ష్మయ్య, శ్రీను ఓంకార్,నాగరాజు, చిన్న వ్యాపారస్తుల సంఘం ట్రెజరర్ జోసఫ్,ఉపాధ్యక్షులు ఎస్కే ఖలీల్ ఇతరులు పాల్గొన్నారు.
పాములపాడు : సిపిఎం మండల కార్యదర్శి సామన్న, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఆవాజ్ కమిటీ నాయకులు సోడా బాష, వ్యకాసం నాయకులు ఏసేపు, మైనార్టీ సంఘం నాయకులు షర్ఫుద్దీన్ అలీలు భగత్ సింగ్ చిత్ర పటానికి నివాళులర్పించారు.
బండి ఆత్మకూర్ : మండల కేంద్రంలో భగత్ సింగ్, రాజు గురు, సుఖ్ దేవ్‌ల వర్ధంతినిసిఐటియు నాయకులు రత్నమయ్య డివైఎఫ్‌ఐ నాయకులు రాజేష్ కార్మిక సంఘం కార్యదర్శి డేవిడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బేతంచెర్ల : మండల కేంద్రంలోని సిపిఎంకార్యాలయం నందు మండల కార్యదర్శి ఆర్ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సిపిఎం సీనియర్ నాయకులు వై ఎల్లయ్య, బేతంచర్ల పట్టణ కార్యదర్శి వైబి వెంకటేశ్వర్లు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేశ ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎస్ సాధిక్ హుస్సేన్, బాలయ్య, రామాంజనేయులు, మద్దిలేటి స్వామి, శ్రీనివాసులు, రామ చంద్రుడు, రామకృష్ణ, రాజబాబు, వెంకటరమణ, చిన్న వెంకటేశ్వర్లు, నరసింహ, అంకాలు, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










