ఓ మహిళాజ్యోతీ!
స్వరాజ్యమా!
అస్తమించావా
ఎక్కడ అన్యాయం
జరిగిందో
ఎక్కడ దౌర్జన్యం
చెలరేగిందో
అక్కడ నీ పిడికిళ్లు
బిగిశాయి
నీమాటలు తూటాల్లాగా
బయల్పడ్డాయి
నీ కంచుకంఠం
దోపిడీదారుల గుండెల్లో
రైళ్లును పరుగుపెట్టించింది
ఉద్యమాలకు ఊపిరి
పోశావు
పోరుబాటకు పాట కట్టావు
కలిమిని కాదన్నావు
లేమి వైపు మొగ్గావు
పీడిత తాడిత ప్రజానీకాన్ని
ఉద్ధరించడానికి
నీ జీవితాన్ని
సమర్పణం చేశావు
సాయుధ విప్లవానికి
ఆకృతినిచ్చావు
స్వరాజ్యస్థాపన కోసం
స్వతంత్ర ఫలాలను
సామాన్యులకు
అందించటం కోసం
వీరనారి
మోగించావు
అవిశ్రాంత సమరభేరి
ఉద్యమం ఉన్నంత కాలం
పోరు ఉన్నంత కాలం
నీవుంటావు
మా వెంటే వుంటావు
మంకుశ్రీను
89859 90215