ప్రజాశక్తి-జగ్గయ్యపేట
పుల్వామాలో వీరమరణం పొందిన జవాన్లకు షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్ సాయిబాబా టెంపుల్ సమీపంలో మంగళవారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అన్నెపాగ కిషోర్‌బాబు, సీనియర్ టిడిపి నాయకులు దామాల ప్రసాద్, సతీష్ సాయి శివ పాల్గొన్నారు. ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: పుల్వామా దాడిలో వీరమరణం పొందిన అమర జవాన్లకు గ్రామ సర్పంచ్ పద్మ కుమారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్యామ్ కుమార్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాశక్తి-గంపలగూడెం: స్థానిక గాంధీ సెంటర్ నుండి తోటమూల వరకు గంపలగూడెం ఎస్‌ఐ వి.సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.










