Jul 12,2023 20:56

వీధి దీపాల్లేవని చూపిస్తున్న నాయకులు

జమ్మలమడుగు రూరల్‌ : స్థానిక రైల్వేస్టేషన్‌ రోడ్డులో ప్రభుత్వ అధికారులు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్‌ కోరారు. ఆ దారిని డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లాడుతూ నాగులకట్ట నుండి రైల్వేస్టేషన్‌ వెళ్లే దారిలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి సమయాల్లో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వివరిం చారు. జమ్మలమడుగు నుండి విజయ వాడ, తిరుపతి, కడపకు రాత్రి, తెల్లవారుజామున రైళ్లు నడుస్తున్నాయన్నారు. రైళ్లు కూడా రాత్రి 10 గంటల సమయంలో, ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు వస్తూ, పోతున్నాయన్నారు. ప్రజలు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రయాణికులు రాకపోకల సందర్భంగా భయాందోళనలకు గురవుతున్నారన్నారు. పోలీసు వారు కూడా రైళ్ల రాకపోకల సమయంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తే క్షేమకరంగా ఉంటుందన్నారు. రోడ్డు బాగా లేదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి తులసీశ్వర్‌ యాదవ్‌, రామయ్య, చిన్ని, విజరు పాల్గొన్నారు.