ప్రజాశక్తి -గాజువాక : వీధి వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని సిఐటియు నాయకులు కెవి.రమణ, వై.లక్ష్మణరావు డిమాండ్‌చేశారు. కొత్త గాజువాకలో ఆదివారం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, గాజువాక వీధుల్లో గంపలు అమ్ముకునేవారు, రోడ్లపై తోపుడు బండ్లు, ఫుట్ పాత్‌పై దుకాణాలు నిర్వహించేవారు సుమారు పదివేల మంది వరకు ఉన్నారని తెలిపారు. వీరికి జివిఎంసి నుంచి ఎటువంటి గుర్తింపు కార్డులూ ఇవ్వలేదని పేర్కొన్నారు. 2017లో కొందరికి ఇచ్చినా వాటికి 2018తో గడువు ముగిసిందన్నారు. తరువాత ఇప్పటివరకు కొత్తగా సర్వే చేయడం గానీ, గుర్తింపు కార్డులు ఇవ్వడం గానీ చేయలేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పథకాల్లో వీధి విక్రయిదారులకు లబ్ధి చేకూరాలంటే గుర్తింపు కార్డు ముఖ్యం అని పేర్కొన్నారు. మరోపక్క వీధులలో విక్రయాలు జరిపేటప్పుడు కొంతమంది అధికారులు, స్థానిక బ్రోకర్లు వీరిని వేధిస్తున్నారని, వెంటనే వీధి విక్రయిదారులందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌చేశారు.










