ప్రజాశక్తి - బల్లికురవ రూరల్
గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వీధి కుక్కలను మండలంలోని గుంటుపల్లి సర్పంచ్ మాదాల కృష్ణకుమారి, శివన్నారాయణ ఆధ్వర్యంలో గుంటుపల్లి, కొత్తపాలెం గ్రామాల్లో వీధి కుక్కలను కార్మికులు చేత బంధించి బోనులు పెట్టి బంధించారు. పట్టుకున్న వీధి కుక్కలను అడవుల్లో వదిలిపెడతామని తెలిపారు. వాహన చోదకులు, పిల్లలు, వృద్ధులపై కుక్కలు దాడిచేసి గాయపరుస్తున్నాయని ప్రజల పిర్యాదుతో వీధి కుక్కలను బంధించారు. దీనిపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.










