Oct 05,2023 00:33

వీధి బాలలపై సర్వే


వీధి బాలలపై సర్వే
ప్రజాశక్తి- పలమనేరు : జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం రాస్‌, ఐసిడియస్‌ ,మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం పలమనేరు పట్టణంలోని బస్టాండు, గంగమ్మ గుడి వీధి, ఏంబిటి రోడ్డు పరిసర ప్రాంతాలలో వీధి బాలులను సర్వే చేశారు. ఈ సర్వేలో వినాయకం, లక్ష్మి , అంజలిని వీధి పిల్లలుగా గుర్తించి అంజలిని చౌడేపల్లె మండలంలోని గర్ల్స్‌ హాస్టల్‌ లో 3 వ తరగతిలో, లక్ష్మిని గంగవరం మండలంలోని ఎంపీపీ ఎస్‌ బొమ్మనపల్లె పాఠశాలలో 4 వ తరగతి లో చేర్పించామని మండల విద్యాశాఖ అధికారి లీలారాణి తెలిపారు. ఈ సర్వేలో పట్టణంలోని అన్ని రంగాల షాపుల యాజమానులకు 14 సంవత్సరాల లోపల బడిఈడు పిల్లలను పనులలోకి చేర్పించుకున్న కుంటే 50 వేలు జరిమాన విధిస్తామని హెచ్చరించారు . ఈ సర్వేలో విద్యాశాఖాధికారులు, ఐసిడిఎస్‌ అధికారులు, సచివాలయ మహిళా పోలీసులు, చైల్డ్‌ ప్రొడక్ట్స్‌ ఆఫీసరు, సి ఆర్‌ పి లు పాల్గొన్నారు.