Jul 31,2023 21:39

రహదారిపై నిలిచిన నీరు
రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
ప్రజాశక్తి - పోడూరు

                    వరద ప్రభావానికి మండలంలోని వద్దిపర్రు గ్రామంలో నక్కల డ్రెయిన్‌ పొంగి రోడ్డు మీదకు నీరు చేరి నాలుగు రోజుల నుంచి అలానే కొనసాగుతుంది. దీంతో వల్లూరు నుంచి పాలకొల్లు వైపు వెళ్లే వద్దిపర్రు, వల్లూరు పంచాయతీ పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్‌కి వెళ్లే పిల్లల కోసం సర్పంచి వడ్లపాటి రాజేంద్రప్రసాద్‌ సొంత ఖర్చులతో ట్రాక్టర్‌పై వదర నీరు నుంచి దాటిస్తున్నారు. పంట పొలాలు, ఆకుమడులు పూర్తిగా నాలుగు రోజుల నుంచి నీటిలోనే మునిగి ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో నక్కల డ్రెయిన్‌ పొంగి రోడ్డు మీదకు, కాలనీలోకి నీరు చేరుతుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు అధికారులకు, రాజకీయ నాయకులకు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
వడ్లపాటి రాజేంద్రప్రసాద్‌, సర్పంచి, వద్దిపర్రు

      ప్రతి ఏడాది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు పట్టించుకోవడంలేదు. వరదలు తగ్గుము ఖం పట్టిన తర్వాత దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.