May 30,2023 00:19

సమావేశంలో మాట్లాడుతున్న కార్పొరేటర్‌ గంగారావు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ సిఐటియు నూతన కమిటీని సోమవారం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రకటించారు. అధ్యక్షునిగా పి.అప్పలరాజు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎస్‌ఎన్‌.మల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా డి.వీరస్వామి, వై.సింహాచలం, కార్యదర్శిగా కెఆర్‌.చంద్రమోహన్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా కె.కుమారి, సంయుక్త కార్యదర్శిగా పి.సుజాత, కమిటీ సభ్యులుగా డి.తాతబాబు, కెఎల్‌.నాయక్‌, పివి.ప్రసాద్‌, ఎన్‌విఆర్‌ పద్మజ, డి.కృష్ణ, వేణు ఎన్నికైనట్లు సిఐటియు ప్రతినిధులు తెలిపారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌ జనరల్‌ ఆసుపత్రిలో పనిచేస్తూ బుధవారం విరమణ పొందుతున్న సిఐటియు నాయకులు మోస దానయ్యను సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, రిటైర్మెంట్‌ తర్వాత కూడా కార్మికుల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్‌ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన ఉద్యమాన్ని ప్రతి గ్రామంలోనూ నిర్వహించాలని సూచించారు. విరమణ పొందిన ఉద్యోగులు ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ, దానయ్య వంటి ఎంతోమంది నాయకులు కృషి వల్ల సిఐటియు బలపడిందని తెలిపారు. కొత్తవారిని తయారు చేయాలని సూచించారు.