May 31,2023 19:22

సిబ్బందితో మాట్లాడుతున్న ఆశాజ్యోతి

ప్రజాశక్తి - పెద్దకడబూరు
మండలంలోని వివిధ గ్రామాల్లో పని చేసే ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు విధులను సక్రమంగా నిర్వర్తించాలని మండల వైద్యాధికారి ఆశాజ్యోతి ఆదేశించారు. బుధవారం పెద్దకడబూరులోని 5వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తమ తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వివిధ రకాలైన వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, అలాగే ఎప్పటికప్పుడు సర్వేర్లు నిర్వహించి రోగులను గుర్తించాలని సూచించారు. పెద్దకడబూరులో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఆశా వర్కర్లు డిఎంహెచ్‌ఒకు సరెండర్‌ చేశామని తెలిపారు. గతంలో ఈమెకు మెమోలు కూడా జారీ చేసినా మారలేదని, అందుకే సరెండర్‌ చేశామని చెప్పారు. ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పని చేస్తున్న గ్రామాల్లోనే నివాసముండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.