Nov 18,2023 00:25

ప్రజాశక్తి - చీరాల
వివిధ సమస్యలపై సచివాలయాలకు వచ్చే ప్రజల అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి సచివాలయ సిబ్బంది బాధ్యతగా కృషి చేయాలని గుంటూరు రీజనల్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. కమిషనర్ చాంబర్లో సచివాలయ సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సచివాలయం సిబ్బంది విధులను బాధ్యతగా నిర్వర్తించాలని అన్నారు.  ప్రభుత్వం సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని, అర్థం కాని సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే కమిషనర్ దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలని సూచించారు. ఇంటి పన్నులు, ఇతర పన్నుల వసూలను విజయవంతంగా చేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. వివిధ శాఖ సిబ్బందితో ఆయన మాట్లాడారు. ఆయన వెంట మునిసిపల్ కమిషనర్ కె  రామచంద్రారెడ్డి, వివిధ మున్సిపల్‌ విభాగాల అధికారులు పాల్గొన్నారు.