విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు- పిహెచ్సి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ గిరీష
లక్కిరెడ్డిపల్లె : గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గిరీష వైద్య అధికారులకు ఆదేశించారు. మండ లంలోని కోనంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు ఎంత మంది వస్తున్నారు. ఇన్ పేషంట్స్ వారి గురించి వాకబు చేశారు. తదుపరి ఫార్మసీ స్టోర్ ఇన్ స్పెక్షన్ చేయడం జరిగింది. మందుల నిల్వ, ఒపి సేవలు, సిబ్బంది హాజరు తదితర రిజిస్టర్‌లు కలెక్టర్ పరిశీలించారు. నిన్న, మొన్న ఎంత మందికి మందులు ఇచ్చారు వంటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని ఆప్‌లైన్, ఆన్‌లైన్‌లో రికార్డులను పరిశీలించి ఇచ్చిన మందులకు సంబంధించి ఎందుకు డేటా ఎంట్రీ సరిగా చేయ లేదని ఫార్మసిస్ట్, వైద్య అధికారులపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్ వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లు అందుబాటులోకి తెచ్చా రన్నారు. విలేజ్ క్లినిక్‌లో కావలసినంత మందులు అందుబాటులో ఉంచాలని డాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రతిరోజు ఎంతమందికి టెస్టింగ్ చేస్తున్నారు వంటి రిపోర్టులను కలెక్టర్ పరిశీలిం చారు. అనంతరం వార్డు రూమును పరిశీలించి రోగుల వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని కాబట్టి జవాబు దారీ తనంతో పనిచే యాలని సూచించారు. ఈ సందఠంగా ఆస్పత్రి లోని వసతులను ఆయన పరిశీలించారు. రోగుల తో మాట్లాడి అక్కడి వైద్య సేవలపై ఆరా తీశారు. నిరంతరం వైద్యసేవలు అందుతున్నాయని లేదా అని అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం టిబి రోగులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి సుదర్శన్ రెడ్డి, ఎంపిటిసి సర్పంచ్, తహశీల్దార్, ఎంపిడిఒ, డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.










