ప్రజాశక్తి- అనంతగిరి:విధి నిర్వహణలో ఉపాధ్యాయులు అలసత్వం వహిస్తే తగు చర్యలు తప్పవని మండల విద్యాశాఖాదికారి బాలాజీ హెచ్చరించారు. శనివారం పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మండలంలోని కొండిబ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, నడిమివలస పాఠశాల లను మండల విద్యాశాఖాదికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటించాలన్నారు. టీచింగ్ నోట్స్. డైరీ, లెసన్ ప్లాన్ కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు ముఖ ఆధారిత హజరు నిర్దేశించిన సమయంలో వేయాలని, మద్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన అమలుపై ఫిర్యాదులు వస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట నడిమివలస, కొండిబ ప్రధానోపాధ్యాయులు మల్లేశ్వరరావు, రామకృష్ణ, కొండిబ వెల్పేర్ ఎడ్యుకేషన్ స్వరూప పాల్గొన్నారు.










