ప్రజాశక్తి-గొలుగొండ: మండలంలోని పప్పుశెట్టిపాలెం గ్రామ సచివాలయం సిబ్బంది సోమవారం విధులకు డుమ్మా కొట్టారు. మధ్యాహ్నాం 12 గంటలైనా ముగ్గురు మినహా ఎవరూ సిబ్బంది విధులకు హాజరు కాలేదు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు బయటే ఉండిపోయారు. ఉదయం 10.30 గంటలకు గ్రామ సచివాలయంకు రావాల్సిన సిబ్బంది 12 గంటలైనా రాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ విజయలక్ష్మీ వచ్చి గ్రామ సచివాలయంను సందర్శించారు. గ్రామ సచివాలయం లో 11 మంది సిబ్బంది విధులు నిర్వహించడం జరుగుతుంది. ముగ్గురు సిబ్బంది సమయంకు వచ్చినా గ్రామ సచివాలయం తాళాలు లేక పోవడంతో వచ్చిన సిబ్బంది కూడా బయట ఉండిపోవాల్సి వచ్చింది. సిబ్బంది సమయపాలన తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ విషయంలో ఇన్‌చార్జ్ ఈఒఆర్‌డి రఘును సంప్రదించగా సిబ్బందికి మెమో ఇవ్వడంతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు.










