Dec 29,2022 00:06

విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న డిఇఒ లింగేశ్వరరెడ్డి

ప్రజాశక్తి -నక్కపల్లి :ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించే లేదని జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి హెచ్చరించారు. మండలంలోని గొడిచెర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఫిజిక్స్‌ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులకు పాఠ్య బోధన చేసి, పలు ప్రశ్నలను వేశారు. పాఠ్య ప్రణాళికలు, చైల్డ్‌ వైస్‌ ఎనాలసిస్‌, విద్యార్థుల గ్రేడింగులు, ఎఫ్‌ఏవన్‌, ఎఫ్‌ఏ టు మధ్య విద్యార్థుల ప్రగతి తదితర అంశాలను క్షుణంగా పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి 25 మంది ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసును జారీ చేశారు. పక్కా ప్రణాళికతో 10వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ డివిడి ప్రసాద్‌ పాల్గొన్నారు.