రికార్డులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ
రికార్డులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ
విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు
ప్రజాశక్తి-వరికుంటపాడు:మండలంలోని రొంపి దొడ్ల సచివాలయాన్ని ఎంపీడీఓ శ్రీదేవి గురువారం తనిఖీ చేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందితో ఆమె మాట్లాడుతూ విధులు పట్ల సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందు బాటులో ఉండి సకాలంలో సమస్యల పరిష్కారంకు ప్రతి ఒక్క ఉద్యోగి కషి చేయాలన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి అవగాహన లేని వారికి అర్థమయ్యేలా సున్నితంగా తెలియపర చాలన్నారు. మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని కోరారు. కార్యక్రమ ంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










