- ముగ్గురి సస్పెన్షన్‌కు కలెక్టర్ ఆదేశం
ప్రజాశక్తి- పోలాకి: ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు విషయంలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ హెచ్చరించారు. మండలంలోని కోడూరు, డి.ఎల్.పురం సచివాలయాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పనితీరు సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సస్పెండ్ చేయాలని మండల అధికారులకు ఆదేశించారు. కార్యదర్శులు సురేష్, హరిప్రసాద్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కాళీప్రసాద్‌పై సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మాన్యువల్ రికార్డులు నిర్వాహణ, ఓటర్ల జాబితాలో ఏ రోజు ఎన్ని చేర్చారు, ఎన్ని తొలగించారు అనే వివరాలు రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. అటువంటి వాటిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కె.శ్రీరాములుకు ఆదేశించారు. అలాగే మండలంలోని అన్ని సచివాలయాలను పరిశీలించి నివేదిక అందజేయాల న్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఉషశ్రీ, డిటి శ్రీనివాసరావు, ఆర్‌ఐ కోటేశ్వరరావు, విఆర్‌ఒలు, కార్యదర్శులు పాల్గొన్నారు.










