పోలీసులకు ఎస్‌పి ప్రశంస
ప్రజాశక్తి - గండేపల్లి
విధి నిర్వహణలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని జిల్లా ఎస్‌పి సతీష్ కుమార్ అన్నారు ఇటీవల జిల్లా వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పట్టుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిన సంగతి విదితమే. దొంగలను పట్టుకోవడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జగ్గంపేట సిఐ బి. సూర్య అప్పారావు, గండేపల్లి ఎస్‌ఐ గణేష్ కుమార్, గండేపల్లి హెడ్ కానిస్టేబుల్ జిఎస్‌ఎన్. మూర్తి (టైసన్), కానిస్టేబుల్ జె.కాశీ విశ్వనాధం, జె. వీరబాబు లకు ఎస్‌పి సతీష్ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేసి వారిని అభినందించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం సక్రమంగా చేస్తే ఖచ్చితమైన సమాచారంతో ఎటువంటి కేసైనా ఛేదించ గలమని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అందరూ సహకరించాలన్నారు.
గండేపల్లి ఎస్‌ఐ గణేష్ కుమార్‌కు ప్రశంసాపత్రాన్ని ఇస్తున్న ఎస్‌పి సతీష్‌కుమార్










