ప్రజాశక్తి - ఆదోని
భవిష్యత్తు తరాలకు కొరత రాకుండా విద్యుత్ వినియోగంలో మెళకువలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఆదోని పట్టణంలో తాగునీటి సరఫరా, వీధిలైట్లకు విద్యుత్‌ను వాడే సమయంలో సమయపాలన పాటించాలని తెలిపారు. అనవసరంగా మోటార్లు స్టార్ట్, పగటిపూట విద్యుత్ దీపాలు వెలగడం వల్ల వృథా అవుతోందని చెప్పారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ వినియోగంపై మున్సిపల్ కార్యాలయం, పంప్ హౌస్ సిబ్బంది, స్ట్రీట్ లైటింగ్ సిబ్బంది, కమ్యూనిటీ సెక్రటరీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మున్సిపల్ ఇంజినీరు నాగభూషణం రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వెంకట చలపతి రెడ్డి, రాజు, అసిస్టెంట్ ఇంజినీర్లు కృపాకర్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగులకు అవగాహన కల్పిస్తున్న కమిషనర్










