పరిశీలిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:ఆంద్ర ఒడిశా రాష్ట్రాల సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని బుధవారం ప్రాజెక్ట్ ఉద్యోగులు, కార్మికులు శ్రమించి పునరుద్ధరించారు.టిఫి డ్యామ్ వద్ద సొరంగ మార్గం వద్ద జాలి గేట్ పడి పోవడంతో గత నాలుగు రోజులుగా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడిన విషయం విధితమే. దీంతో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, కార్మికులు రాత్రి పగలు కష్టించి విద్యుత్ ఉత్పాదనకు ఆటంకం లేకుండా పునరుద్ధరించారు. మిగిలిన రెండు జనరేటర్లు సైతం వినియోగంలోకి తీసుకుని వస్తామని ప్రాజెక్ట్ ఎస్‌ఈ కెవి నాగేశ్వరరావు తెలిపారు.










