ప్రజాశక్తి - మంత్రాలయం
తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డిని విద్యుత్ ఉద్యోగులు కోరారు. బుధవారం మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామమైన రాంపురంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఎడి విశ్వ శాంతి స్వరూప్, రాఘవేంద్రప్ప, ఎఇ గోవిందు మాట్లాడారు. ఉద్యోగుల పిఆర్‌సి, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రుద్రప్ప, ఎఎఒ చంద్ర బోస్, లైన్ మెన్‌లు తిమ్మప్ప, రంగస్వామి ఉన్నారు.
వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగులు










