Aug 17,2023 20:29

నిరసన తెలుపుతున్న దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు :విద్యుత్‌ 2022 ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ స్ట్రగుల్‌ కమిటీ పిలుపు మేరకు 17వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం భగం చేయడాన్ని తప్పుపడుతూ నగరంలోని విద్యుత్‌ భవన్‌ ఎదుట ఉద్యోగులు, కార్మికులు నిరసన చేపట్టారు. గురువారం చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో యుఇఇయు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ 2022 విద్యుత్‌ ఒప్పందాన్ని వెతిరేకిస్తూ ,స్ట్రగుల్‌ కమిటీ చేపట్టిన 17 వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నీరు గార్చే విధంగా కార్మిక నేతలను గహ నిర్బంధం చేయటం, విజయవాడలో ధర్నాకి అనుమతి ఇవ్వక పోవడాన్ని నిరసించారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. యుఇఇయు రాష్ట్ర ఉపాధ్యక్షులు శివ ప్రసాద్‌, రాష్ట్ర నాయకులు హాజరతయ్య,పెంచాల ప్రసాద్‌, జిల్లా నాయకులు హరినారాయణ, నాగయ్య, విజయరామిరెడ్డి, మజార్‌, కొండయ్య , కాంట్రాక్టు కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ సుమన్‌ అధ్యక్షులు పూనమల్లి కష్ణ, నగర కార్యదర్శి ఆరిఫ్‌, అధ్యక్షులు సునీల్‌, గూడూరు అధ్యక్షులు శ్రీనివాసులు, కావలి అధ్యక్షులు నాంచారయ్య, జిల్లా నాయకులు శ్రీను, కిషోర్‌, వంశీ, మనోజ్‌,ఫయాజ్‌, రాజా బాబు తదితరులు పాల్గొన్నారు.