కడప అర్బన్ : విద్యుత్ ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల, ఎనర్జీ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కారానికి యాజమాన్యం, ప్రభుత్వంతో 16 నెలలుగా 25 సార్లు చర్చలు జరిపినా ఎలాంటి సానుకూల స్పందన లేదని అందుకే ఎ.పి విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఏర్పాటు చేసి విద్యుత్ ఉద్యమం ఉధతం చేస్తున్నామని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఈనెల 26న యాజమాన్యానికి సమర్పించిన వినతి పత్రంలోని అంశాలను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎపి విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి మాట్లాడుతూ సిఎం జగన్ హామీ మేరకు కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. వేతన సవరణ ఒప్పందం తర్వాత కూడా విద్యుత్ స్ట్రగుల్ కమిటీ పోరాటాలు చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా నాయకులు యన్. శివశంకర్ మాట్లాడుతూ స్ట్రగుల్ కమిటీ పిలుపు మేరకు ఈనెల 31న కలెక్టర్లకు వినతి పత్రం అందజేయడం, ఆగస్టు 2న జిల్లా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు, 7న తిరుపతి కార్పొరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలకు విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు తరలి వచ్చి మన నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఎల్‌ఐసి డివిజన్ నాయకులు అవధానం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ 16 నెలలు గడిచినా ప్రకటించక పోవడం అన్యాయమని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులను 25 ఏళ్లుగా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని తెలిపారు. ఆశా వర్కర్ల జిల్లా నాయకులు రాజామణీ మాట్లాడుతూ విద్యుత్ స్ట్రగుల్ కమిటీకీ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం ఒక్కటే మార్గమని తెలిపారు. స్ట్రగుల్ కమిటీ ఉపాధ్యక్షులు గంగయ్య మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఆర్‌టిపిపి నాయకులు వెంకట స్వామి, విజయా, రమేష్ సాంబశివారెడ్డి, నాగేంద్ర మాట్లాడుతూ ఉద్యమం ముందుకు తీసుకెళ్లేందుకు కషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా స్ట్రగుల్ కమిటీ నాయకులు నాగసుబ్బయ్య, శ్రీ హరి మాట్లాడుతూ 31వ తేదీన చర్చలు విద్యుత్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు, ఎనర్జీ అసిస్టెంట్లకు మేలు జరిగేలా ఉండాలని ఆకాంక్షించారు. బిల్డింగ్ యూనియన్ నాయకులు చంద్రారెడ్డి మాట్లాడుతూ స్ట్రగుల్ కమిటీ చేసే పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా మాట్లాడుతూ ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో యుటిఎఫ్ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ యూనియన్ నాయకులు తారక రామ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ రంగం నుంచి పూర్తిగా మద్దతు తెలిపారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్ మాట్లాడుతూ పోరాటాలకు అండగా ఉంటామని తెలిపారు. ఎఐటియుసి నగర కమిటీ నాయకులు మద్దిలేట మాట్లాడుతూ స్ట్రగుల్ కమిటీ చేసే ఉద్యమం జయప్రదమతుందని పేర్కొన్నారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై దష్టి సారించక పోవడం శోచనీయమని చెప్పారు. విద్యుత్ సంస్థలో రెండు కార్మిక సంఘాల వల్ల విద్యుత్ ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. చిన్న, చితకా సంఘాలన్నీ కేవలం తమ సొంత ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వామపక్ష కార్మిక సంఘాలు, మరి కొన్ని సంఘాలు కలుపు కుని స్ట్రగుల్ కమిటీ ఏర్పాటు చేసారని చెప్పారు. ఈ స్ట్రగుల్ కమిటీ విద్యుత్ ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఉధతం చేస్తామని హెచ్చరించారు.










